Mar 02,2021 21:44

న్యూఢిల్లీ : నిర్మాణ, గనులకు సంబంధించిన యంత్ర సామాగ్రికి సంబంధించిన అతిపెద్ద తయారీదారు కాటర్‌ పిల్లర్‌ దేశంలో 50 వసంతాల వేడుకలను జరుపుకుంటున్నట్లు తెలిపింది. 1930లో ప్రారంభమైన తమ సంస్థకు సుదీర్ఘమైన చరిత్ర ఉందని పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా 193 దేశాలలో దాదాపు 1,60,000 మంది ఉద్యోగులు సంస్ధకు ఉన్నారు. భారత్‌లో ఆరు అత్యాధునిక తయారీ కేంద్రాలు, రెండు ఆర్‌ అండ్‌ డీ కేంద్రాలు, ఐదు సబ్సిడరీ సంస్థలు, ఎనిమిది కాటర్‌పిల్లర్‌ బ్రాండ్స్‌తో కార్యకలాపాలు కలిగి ఉన్నట్లు తెలిపింది. 1948లో భాక్రానంగల్‌ డ్యామ్‌ నిర్మాణ సమయంలో కాట్‌ యంత్రసామాగ్రిని వినియోగించారని కాటర్‌పిల్లర్‌ ఇండియా కంట్రీ మేనేజర్‌ బన్సీ ఫన్సాల్కర్‌ అన్నారు.