Mar 19,2023 22:37

నమూనా చెక్కును అందజేస్తున్న గడ్డెమ్మ

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: జగనన్న విద్యాదీవెన కింద జిల్లాలో 53867 మంది విద్యార్థులకు లబ్ధి కలిగింది. ఎన్‌టిఆర్‌ జిల్లా తిరువూరులో సిఎం జగన్మోహన్‌రెడ్డి డిబిటి విధానంలో ఆదివారం జగనన్న విద్యాదీవెన నిధులను విడుదల చేశారు. జిల్లాలో 53,867 మంది విద్యార్థులు ఐటిఐ, పాలిటెక్నిక్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, తదితర కోర్సులు చదువుతుండగా 48,345 తల్లుల ఖాతాల్లో 2022-23 విద్యా సంవత్సరానికి మొదటి విడతగా నగదును జమచేశారు. జిల్లాలో 4,124 ఎస్‌సి విద్యార్థుల్లో 3,767 మంది తల్లుల ఖాతాల్లో రూ.3.37 కోట్లు, 1,373 మంది ఎస్‌టి విద్యార్థులకు 1,272 మంది తల్లుల ఖాతాల్లో రూ.52.97 లక్షలు, 45,761 మంది బిసి విద్యార్థులకు 40,968 మంది తల్లుల ఖాతాల్లో రూ.25.84 కోట్లు జమ చేశారు. 1,730 మంది ఇబిసి విద్యార్థులకు 1,588 మంది తల్లుల ఖాతాల్లో రూ.99లక్షలు, 157 మంది ముస్లిం మైనారిటీ విద్యార్థులకు 143 మంది తల్లుల ఖాతాల్లో రూ.8.26 లక్షలు , 703 మంది కాపు విద్యార్థులకు 668 మంది తల్లుల ఖాతాల్లో రూ.56.95 లక్షలు, 19 మంది క్రిస్టియన్‌ మైనారిటీ విద్యార్థులకు 17 మంది తల్లుల ఖాతాల్లో రూ.1.68 లక్షలు వేశారు. శ్రీకాకుళం కలెక్టరేట్‌లో సాంఘిక సంక్షేమశాఖ ఇన్‌ఛార్జి ఉప సంచాలకులు, బిసి కార్పొరేషన్‌ కార్యనిర్వాహక సంచాలకులు ఆర్‌.గడ్డెమ్మ, గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకులు బి.నగేష్‌, బిసి సంక్షేమ అధికారి ఇ.అనురాధ, డిపిఎం పొట్నూరు శరత్‌ విద్యార్థులకు నమూనా చెక్కును అందజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.