Oct 02,2022 21:45

ఢిల్లీ: వచ్చే ఏడాది చివరికల్లా దేశంలోని ప్రతి గ్రామానికీ 5జీ సేవలు అందిస్తామని రిలయన్స్‌ జియో మాతఅసంస్థ రిలయన్స్‌ ఇండిస్టీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ వెల్లడించారు. ప్రపంచంలోనే అధిక నాణ్యత, అందుబాటు ధరల్లో 5జీ సేవలను అందించేందుకు ప్రయత్నిస్తామని, శనివారం ఇక్కడ ప్రారంభమైన ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ (ఐఎంసీ)లో ఆయన ప్రకటించారు.'ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా రిలయన్స్‌ 5జీ వ్యవస్థల్లో చాలావరకు దేశీయంగానే అభివఅద్ధి చేశాం. 5జీ, 5జీ ఆధారిత డిజిటల్‌ పరిష్కారాలను అనుసంధానించి సామాన్యులకూ నాణ్యమైన విద్య, నైపుణ్యాభివఅద్ధి అందించగలం. గ్రామీణ ప్రాంతాల్లోని ఆసుపత్రులను ఎక్కువ ఖర్చు లేకుండానే స్మార్ట్‌ ఆసుపత్రులుగా మార్చొచ్చు. అత్యుత్తమ వైద్యుల సేవలను దేశంలో ఎక్కడినుంచైనా డిజిటల్‌లో పొందొచ్చు. రోగ నిర్థారణ పరీక్షల్లో వేగం, కచ్చితత్వం మెరుగవుతాయి. చికిత్స నిర్ణయాల్లో వేగం పెరుగుతుంది. ఫలితంగా మారుమూల ప్రాంతాల వారికీ అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ సేవలు అందుబాటులోకి వస్తాయి. వ్యవసాయం, సేవలు, వాణిజ్యం, పరిశ్రమలు, అసంఘటిత రంగాలు, రవాణా, ఇంధన మౌలిక సదుపాయాల్లో డిజిటలీకరణ, ఇంటెలిజెంట్‌ డేటా ద్వారా పట్టణ, గ్రామీణ భారతం మధ్య అంతరాన్ని తగ్గించొచ్చు' అని ముకేశ్‌ తెలిపారు. దీపావళి నాటికి దేశంలో 5జీ సేవలను కొన్ని నగరాల్లో అందుబాటులోకి తీసుకొస్తామని ముకేశ్‌ స్పష్టం చేశారు. టారిఫ్‌లు 'అందుబాటు ధర'లో ఉంటాయని వెల్లడించారు. ప్రపంచంలోనే తక్కువ ధరకు 5జీ సేవలను అందించేందుకు మన టెలికాం రంగం సమష్ఠిగా కఅషి చేస్తోందని పేర్కొన్నారు.