
కణితను తొలగించిన డాక్టర్
6 కిలోల కణితి తొలగింపు
నెల్లూరు:గడిచిన మూడు నెలలుగా కడుపు నొప్పి, ఉబ్బసం వంటి అనారోగ్య సమస్యతో బాధపడుతున్న అలివేలమ్మ (24) మహిళకు డాక్టర్లు శస్త్ర చికిత్సలు నిర్వహించి, బాధితురాలి కడుపులోని 6 కిలోల కణితను విజయవంతంగా తొలగించారు. సోమవారం నగరంలోని మెడికవర్ వైద్యశాలలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వైద్యులు ఈ శస్త్ర చికిత్సలకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. నగరంలోని మెడికవర్ హాస్పిటల్ కు అలివేలమ్మ అనే మహిళ ఇటీవల విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతూ వైద్యచికిత్సల నిమిత్తం వచ్చారన్నారు. వైద్యశాలకు చెందిన సర్జికల్ అంకాలజీ విభాగానికి చెందిన డాక్టర్ అవినాష్ బాధితురాలకి పరీక్షలు నిర్వహించే క్రమంలో సీటీ స్కాన్ చేయగా గర్భాశయంలో పెద్ద కణిత ఉన్నట్లు గుర్తించారు. ఆ కణిత గర్భాశయాన్ని పూర్తి గ ఆక్రమించడంతో విపరీతమైన కడుపు నొప్పి వస్తున్నట్లు నిర్ధారించారు. కణితకు క్యాన్సర్ లక్షణాలు కూడా ఉన్నట్లు గుర్తించారు. వెంటనే శస్త్రచికిత్స నిర్వహించాలని రోగి కుటుంబసభ్యుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. బాధితురాలి కుటుంబ సభ్యుల అంగీకారంతో శస్త్ర చికిత్సలు నిర్వహించి 30 ఞ30 సెంటీమీటర్ల వ్యాసార్ధంతో 6 కిలోల బరువున్న కణితను తొలగించామన్నారు. రోగి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు పేర్కొన్నారు. ఆపరేషన్ నిర్వహించడం ఆలస్యం అయి ఉంటే చాలా ప్రమాదకరంగా మారేదని, కణితకు క్యాన్సర్ లక్షణాలు ఉండటంతో ఆపరేషన్ సమయంలో పలు జాగ్రత్తలు తీసుకున్నామని తెలియజేశారు. ఈ ఆపరేషన్ ను ఆరోగ్య శ్రీ పథకంలో నిర్వహించామన్నారు.