Feb 23,2021 08:45

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ప్రైవేట్‌ రంగాన్ని అనుమతిస్తే.. 60 రోజుల్లో 50 కోట్ల మందికి వ్యాక్సిన్‌ వేయవచ్చని విప్రో వ్యవస్థాపకుడు అజీమ్‌ ప్రేమ్‌జీ తెలిపారు. బెంగళూరు చాంబర్‌ ఆఫ్‌ ఇండిస్టీ అండ్‌ కామర్స్‌లో జరిగిన చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఈ విషయాన్ని తెలిపారు. ప్రైవేట్‌ రంగం భాగస్వామ్యంతో కోవిడ్‌- వ్యాక్సినేషన్‌ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచవచ్చని ఆశిస్తున్నట్లు తెలిపారు. రికార్డు సమయంలో కొవిడ్‌ - 19 వ్యాక్సిన్‌ను రూపొందించారని, ఇప్పుడు పెద్ద సంఖ్యలో ప్రజలకు వ్యాక్సిన్‌ను అందించడమే ముందున్న లక్ష్యమని చెప్పారు. సీరం ఇన్‌స్టిట్యూట్‌ నుండి టీకా ఒక్కో డోసును రూ.300కి ఇచ్చేలా ఒప్పందం కుదిరిందని, అదనంగా మరో రూ.100 కలుపుకుని ఆస్పత్రులు, నర్సింగ్‌హోంలలో రూ.400కే టీకాను అందిస్తామని అన్నారు. దీంతో దేశంలో భారీగా వ్యాక్సినేషన్‌ సాధ్యమవుతుందని ప్రేమ్‌జీ అన్నారు.