
హైదరాబాద్ : ఖైరతాబాద్‌లో కొలువుదీరిన 63 అడుగుల మహా వినాయకుడికి తొలిపూజ జరిగింది. సోమవారం నిర్వహించిన ఈ తొలి పూజా కార్యక్రంమలో తెలంగాణ గవర్నర్ తమిళి సై, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని, దానం నాగేందర్ తదితర ప్రముఖులు పాల్గన్నారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళి సై మహా గణేశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలు అంతా సుఖశాంతులతో, ఆరోగ్యాంగా ఉండాలని ఖైరతాబాద్ గణేషుడిని కోరుతున్నానన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ... రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు గాని సమస్యలు గాని తలెత్తకుండా అన్ని విభాగాలను సమన్వయము చేశామన్నారు. ప్రభుత్వం తరపున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామన్నారు. నిమజ్జనం వరకు కూడా ఈ ఏర్పాట్లు కొనసాగుతాయని తెలిపారు.