
ప్రజాశక్తి-కాకినాడ 7 లయన్స్ క్లబ్బుల నూతన కార్యవర్గాలతో క్లబ్ పూర్వ జిల్లా గవర్నర్ డాక్టర్ బాదం బాలకష్ణ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా బాలకష్ణ మాట్లాడుతూ లయన్స్ క్లబ్‌ల కార్యక్రమాలు ప్రస్తుత సమాజ అవసరాలకు అనుగుణంగా, మహిళలు స్వయం ఉపాధి పొందేలా కార్యక్రమాలు రూప కల్పన చేయాలన్నారు. ప్రజల ఆరోగ్య అవసరాలు తీర్చే విధంగా సేవాకార్యక్రమాలు రూపొందించు కోవాలన్నారు. ప్లాస్టిక్ వాడకం నిషేధం, నీటి పొదుపు, ఆహారం వధా కాకుండా చూడటం వంటి కార్యక్రమాలపై ఎక్కువ దష్టి పెట్టాలని సూచించారు. నూతన అధ్యక్షులుగా లయన్స్ కాకినాడకు ఎన్.మురళీకష్ణ, పుష్కర క్లబ్‌కు ఎన్విఆర్.గాంధీ, గోల్డెన్ జూబిలీ క్లబ్‌కు టివిఎస్. దుర్గేష్, సఖి క్లబ్‌కు ఎంపిఎస్ కుమారి, మనం క్లబ్‌కు దైవకృపామణి, స్టార్స్ క్లబ్‌కు గణేష్ ప్రసాద్, డైమండ్స్ క్లబ్‌కు పలుకూరి సుబ్రమణ్యం ఎన్నికయ్యారు. పూర్వపు జిల్లా గవర్నర్ ముంజులూరి విశ్వేశ్వర్రావు నూతన సభ్యులతో ప్రమాణం చేయించారు. వేలూరి సూర్యనారాయణ, ఇవివి.ఈశ్వర్ కుమార్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వడ్డాది జ్యోతి, నూలు నాగలక్ష్మి, ఎం.వెంకటరమణ, పద్మతులసి, సాయిప్రదీప్, చిట్నీడి శ్రీనివాస్, దంగేటి సతీష్, ఎన్విఆర్.మోహన్ కుమార్, వడ్డాది మూర్తి పాల్గొన్నారు.