Jan 31,2023 21:07

కోల్‌కత్తా : ప్రభుత్వ రంగంలోని కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (సిఐఎల్‌) ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో 70 శాతం వృద్థితో రూ.7,755.55 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే క్యూ3లో రూ.4,558.39 కోట్ల లాభాలు నమోదు చేసింది. గడిచిన క్యూ3లో కంపెనీ ఉత్పత్తి పెరగడంతో పాటు డిమాండ్‌, అధిక అమ్మకాలు మెరుగైన ఫలితాలకు దోహదం చేశాయి. క్రితం క్యూ3లో కంపెనీ రెవెన్యూ రూ.35,169 కోట్లకు చేరింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.28,433 కోట్లుగా చోటు చేసుకుంది.