
ప్రజాశక్తి- విలేకర్ల యంత్రాంగం
టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాటికి 7వ రోజుకు చేరాయి.
యలమంచిలి : చంద్రబాబు అరెస్టుకు నిరసనగా యలమంచిలిలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారం 7వ రోజుకు చేరుకున్నాయి. పార్టీ సీనియర్ నాయకులు పప్పల చలపతిరావు, నియోజకవర్గ ఇన్‌ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు నేతృత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కొలుకులూరి విజయబాబు, రాజాన సూర్యనాగేశ్వరరావు, గొర్లె నానాజీ, ఆడారి రమణబాబు, కౌన్సిలర్ మజ్జి రామకృష్ణ, జనసేన నాయకులు బొద్దపు శ్రీను, నారాయణమ్మ, సన్యాసినాయుడు, ఆదిమూర్తి పాల్గొన్నారు.
అనకాపల్లి : రాష్ట్ర తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు కొణతాల రత్నకుమారి, అర్బన్ జిల్లా కార్యదర్శి శంకర్ల పద్మ, జిల్లా అధ్యక్షురాలు ఆడారి మంజు ఆధ్వర్యాన పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ కార్యాలయం చేపట్టిన నిరాహార దీక్షలు మంగళవారం నాటికి 7వ రోజుకు చేరాయి. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళ నాయకులు కాయల ప్రసన్న లక్ష్మీ, కోట్ని ఉమా, సీరంశెట్టి వెంకట లక్ష్మీ, భీసెట్టి హేమ తదితరులు పాల్గొన్నారు.
పరవాడ : జివిఎంసి 79వ వార్డు లంకెలపాలెంలో ఆ వార్డు కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్ కార్యాలయం వద్ద సామూహిక నిరాహార దీక్ష మంగళవారం చేపట్టారు. దీనిని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్, నాయకులు కరణం సత్యారావు, మఛా శివకుమార్, బొబ్బరి సూర్య, గొల్లవిల్లి భవాని పాల్గొన్నారు.
నక్కపల్లి: చంద్రబాబు,అక్రమ అరెస్టును నిరసిస్తూ తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, స్థానిక మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఆధ్వర్యంలో నక్కపల్లి ఎన్‌టిఆర్ విగ్రహం వద్ద మంగళవారం నియోజకవర్గ మహిళా నేతలతోరిలే దీక్ష చేపట్టారు. .చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ స్కిల్‌డెవలప్‌మెంట్ కార్యక్రమంలో లబ్ధి పొందిన యువకులతోపాటు ప్రపంచవ్యాప్తంగా పలువురు నిరసన చెబుతున్నా, వైసిపి ప్రభుత్వం కక్షసాధింపు ధోరణితో మరిన్ని కేసులను చంద్రబాబుపై పెట్టడం దుర్మార్గమన్నారు. కడిగిన ముత్యంలాచంద్రబాబు కేసు నుండి బయట పడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుమహిళా అధ్యక్షురాలు రమా కుమారి, మండల అధ్యక్షురాలు ఆకేటి శాంతి, పలువురు మహిళా నేతలు, పార్టీ మండల శాఖ అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేష్ పాల్గొన్నారు .
భీమునిపట్నం : జివిఎంసి 3వ వార్డు టిడిపి శ్రేణులు మంగళవారం స్థానిక బీచ్‌లోని లైట్ హౌస్ వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ గంటా అప్పలకొండ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు, నాయకులు చురకల రమణ, పి లక్ష్మీకుమారి, ఎ.గురునాథ్, గండిబోయిన పోలిరాజు, ఎ.నూకరాజు, వియ్యపు పోతురాజు తదితరులు పాల్గొన్నారు.
భీమిలి పార్టీ కార్యాలయం వద్ద చేపట్టిన దీక్షలు మంగళవారం నాటికి 10వ రోజుకు చేరాయి. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి కోరాడ రాజబాబు, కార్పొరేటర్లు గాడు చిన్ని కుమారిలక్ష్మి, గంటా అప్పలకొండ, మొల్లి హేమలత, పి.మంగమ్మ, మాజీ ఎంపిపి యరబాల కృష్ణవేణి, బోయి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
పెందుర్తి : తెలుగు యువత ఆధ్వర్యాన పెందుర్తిలోని టిడిపి కార్యాలయం నుంచి కూడలి వరకు అర్ధనగ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బండారు అప్పలనాయుడు, కనకదేవుడు, డి.రమణ, శ్రీనుయాదవ్, జితేంద్ర, ఆవగడ్డ అప్పలనాయుడు, దాట్ల మధు తదితరులు పాల్గొన్నారు.
గోపాలపట్నం : పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యాన గోపాలపట్నం మెయిన్ రోడ్డులో నిరసన తెలిపారు.
ఎంవిపి.కాలనీ : విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు సతీమణి సుజన అధ్వర్యంలో మహిళలు నిరసన తెలిపారు. దీక్షకు కూర్చున్న రామకృష్ణబాబుకు మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి చొడే పట్టాభిరామ్ సతీమణి చోడే పద్మజ, లక్ష్మి, శ్రీలక్ష్మి, హేమ, గిరిజ, శ్రీదేవి, మాధవీ లత, దేవి, దీప్తి, అమ్మాజీ, భవిత పాల్గొన్నారు.
గాంధీ విగ్రహానికి వినతి
అనకాపల్లి : రాష్ట్రంలో హింసా మార్గాన్ని నిరసిస్తూ స్థానిక ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో మహాత్మా గాంధీ విగ్రహానికి తెలుగు యువత నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలుగు యువత నాయకులు బొడ్డేడ మురళి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రమంతా ఎమర్జెన్సీ నాటి రోజులు తలపిస్తున్నాయని, ప్రజాస్వామ్యానికి ఖూనీ జరుగుతుందని ఆరోపించారు. కార్యక్రమంలో మల్ల గణేష్, పొలిమేర నాయుడు, కర్రి మల్లేశ్వరరావు, బుద్ధ భువనేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీలో నిరసనలో స్థానిక టిడిపి నేతలు
నక్కపల్లి: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఢిల్లీలో మంగళవారం లోకేష్, టిడిపి ఎంపీలు, మాజీ ఎంపీలు ,మాజీ మంత్రులు చేపట్టిన మౌన దీక్షలో పాయకరావుపేట నియోజకవర్గ నేతలు పాల్గొన్నారు.చంద్రబాబు అక్రమ అరెస్టు నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి బాపు ఘాట్ వద్ద మహాత్మునికి నివాళులర్పించి ,మౌన దీక్ష చేపట్టారు. కార్యక్రమంలో నియోజకవర్గ టిడిపి నేతలు కొప్పిశెట్టి బుజ్జి, వినోద్ రాజు, లాలం కాశీ నాయుడు, గుర్రం రామకృష్ణ పాల్గొన్నారు.