Oct 18,2020 22:14

177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ 33 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయి, ఎనిమిది ఓవర్లు ముగిసే సరికి 71 పరుగులు చేసింది. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (11) జప్ప్రీత్‌ బూమ్రా వేసిన నాలుగో ఓవర్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. తొలి ఓవర్‌లో ఫోర్‌ బాదిన అగర్వాల్‌ అక్కడి నుంచి నెమ్మదించాడు. రెండో ఓవర్‌లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే వచ్చాయి. బౌల్ట్‌ వేసిన మూడో ఓవర్‌లో కెఎల్‌ రాహుల్‌ మూడు ఫోర్లు, సిక్స్‌తో చెలరేగి 20 పరుగులు రాబట్టాడు. బూమ్రా నాలుగో ఓవర్‌లో మయాంక్‌ అగర్వాల్‌ను వికెట్‌ తీయడంతో పాటు ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి స్కోర్‌ను కట్టడి చేశాడు. ఐదో ఓవర్‌లో క్రిస్‌ గేల్‌ సిక్స్‌ బాదగా.. ఆరో ఓవర్‌లో రాహుల్‌ సిక్స్‌, ఫోర్‌తో చెలరేగిపోయాడు. ఏడో ఓవర్‌లో గేల్‌ సిక్స్‌, ఎనిమిదో ఓవర్‌లో ఫోర్‌ బాదడతో ఎనిమిది ఓవర్లు ముగిసే సరికి పంజాబ్‌ ఒక వికెట్‌ నష్టానికి 71 పరుగులు చేసింది.