
ప్రజాశక్తి-కురిచేడు : ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి దర్శి నియోజకవర్గం నుండి స్థానికుడిగా తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చి ఒక అవకాశం ఇస్తే 80 వేల ఓట్లతో గెలిచి ఆయనకు బహుమతిగా ఇస్తానని వైసిపి మండల నాయకులు ఆవుల వెంకటరెడ్డి అన్నారు. బుధవారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాయం ఆవరణ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డారు. తాను 38 సంవత్సరాలుగా రాజకీయాలలో ఉంటూ అనేక పదవులలో పనిచేశానన్నారు. మొదట్లో టిడిపికి తరు వాత వైసిపికి తన శక్తివంచన లేకుండా పని చేసి స్థానికేతరులుగా ఉన్న ఎందరినో ఎమ్మె ల్యేలుగా గెలిపించేందుకు చాకిరీ చేశామ న్నారు. ఈ నియోజకవర్గంలో స్థానికేతరులు ఎమ్మెల్యేగా వచ్చి ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుకు రూ.1500 ఇచ్చి సుమారు రూ.400 కోట్లకు సంపాదించుకునే ఎమ్మెల్యేల పరిస్థితి రాష్ట్రమంతా ఉందన్నారు. ఇటీవల ఎమ్మెల్యే చేస్తున్న కార్యక్రమాలకు ఆయన తనను పిలవకపోవడం వారి దురదృష్టమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కేశనపల్లి క్రిష్టయ్య పాల్గొన్నారు.