
నిర్మాణాన్ని ప్రారంభించిన ఇజ్రాయిల్
జెరూసలెం : ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ ఉత్తర ప్రాంతంలో ప్రస్తుతమున్న కంచె స్థానంలో 9మీటర్ల ఎత్తైన గోడను ఇజ్రాయిల్ ఏకపక్షంగా నిర్మిస్తోంది. ఇందుకు భద్రతను సాకుగా చూపుతోంది. ఇజ్రాయిల్ రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం ఒక ప్రకటన చేస్తూ, 45కిలోమీటర్ల పొడవైన ఈ గోడ నబ్లస్ సిటీకి తూర్పు ప్రాంతంలోని పాలస్తీనా గ్రాం సలేం నుండి తుల్కారామ్ నగర ఉత్తర ప్రాంతం వరకు విస్తరింపజేయనున్నట్లు తెలిపారు. ఈ గోడ నిర్మాణంలో పెద్ద ఎత్తున కాంక్రీట్ గోడ, రక్షణ చర్యలు, ఇతర సాంకేతిక సంబంధిత అంశాలు ఇమిడి వున్నాయి. ఏప్రిల్‌లోనే ఇజ్రాయిల్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు ఆమోద ముద్ర వేసింది. ఈ నిర్మాణం కోసం కోటీ 40లక్షల అమెరికన్ డాలర్లను కేటాయించింది. ప్రస్తుతమున్న కంచె 20ఏళ్ళ క్రితం వేసింది. వెస్ట్ బ్యాంక్‌పై ఇజ్రాయిల్‌కు గల పట్టుకు కీలక చిహ్నంగా ఈ కంచె వుంటుంది. పాలస్తీనా దాడులను నివారించేందుకు ఇది అవసరమని ఇజ్రాయిల్ వాదిస్తోంది.