Jan 31,2023 21:10

హైదరాబాద్‌ : ప్రయివేటు టెలికం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా (విఐ) కొత్తగా రూ.99 ప్యాక్‌ను విడుదల చేసింది. వినియోగదారులు డిజిటల్‌ ఇండియా వృద్థిలో పాల్గొనేందుకు ఇది తోడ్పడనుందని ఆ కంపెనీ పేర్కొంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సర్కిల్‌లోని వినియోగదారులు ఫుల్‌ టాక్‌టైమ్‌, 200 ఎంబి డాటాను 28 రోజుల గడువుతో అందిస్తున్నట్లు పేర్కొంది. అట్టడుగు వర్గాల ప్రజలకు సైతం చేరువకావాలనే ఉద్దేశ్యంతో దీన్ని ఆవిష్కరించినట్లు పేర్కొంది.