Aug 10,2022 09:04

నిజామాబాద్‌ : కారు టైరు పేలడంతో అదుపుతప్పి బోల్తాపడింది.. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఈ దుర్ఘటన నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌ బైపాస్‌ కొత్తపల్లి వద్ద చోటుచేసుకుంది.

హైదరాబాద్‌ నుంచి నిర్మల్‌ వైపు వెళుతున్న కారు నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌ బైపాస్‌ కొత్తపల్లి వద్దకు వచ్చేసరికి టైరు పేలి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మరో ముగ్గురు తీవ్రగాయాలపాలయ్యారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. క్షతగాత్రులను ఆర్మూర్‌ ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిలోనూ ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కారులో ప్రయాణిస్తున్నవారంతా హైదరాబాద్‌లోని టోలిచౌకి వాసులుగా పోలీసులు భావిస్తున్నారు. ముప్కాల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.