Mar 18,2023 06:51

వాతావరణం మారి పిల్లలకు, పెద్దలకు దగ్గు, జ్వరాలు వస్తున్నాయి. జ్వరం 101 డిగ్రీల ఫారిన్‌ హీట్‌ కన్నా తక్కువగా వుంటే, ప్రత్యేకమైన వైద్యం అవసరం లేదు. ద్రవ పదార్థాలు తీసుకుంటే సరిపోతుంది. మందులు వాడుతూనే గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. జ్వరం 103 డిగ్రీల ఫారిన్‌ హీట్‌ దాటి 2 గంటల కంటే ఎక్కువసేపు ఉన్నా, వచ్చి 2 రోజులు దాటినా, టెంపరేచర్‌ 105 డిగ్రీస్‌ ఫారిన్‌హీట్‌ దాటినా, వైద్యుడిని సంప్రదించాలి.
ఈ జ్వరంతో పాటు కళ్లలో నీళ్లు కారటం, బాగా నీరసం, వాంతులు వంటి లక్షణాలు కనిపించినా రోగికి ఎక్కువగా నీళ్లు తాగించాలి. దీని వల్లన శరీరం డిహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటుంది. తర్వాత రోగికి తగినంత విశ్రాంతి ఇవ్వాలి. తేలికపాటి ఆహారంతో బాగా నిద్రపోవాలి. ముఖ్యంగా రోగి ఆందోళనకు గురికాకుండా చూసుకోవాలి.
కాచి వడబోసి చల్లార్చిన నీటిని తాగాలి. క్లోరినేషన్‌ చేసిన నీటిని తీసుకోవాలి. కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, గంజి, పళ్ల రసాలు తాగాలి. మందులతో పాటు ఓఆర్‌ఎస్‌ ద్రావణాన్ని గంట గంటకు తాగుతుండాలి. దాంతో జ్వరం తగ్గి త్వరగా కోలుకుంటారు.