Aug 19,2022 21:35

ప్రజాశక్తి-తిరుపతి బ్యూరో, విజయవాడ : సామాన్యుడైన గాంధీ అహింసా మార్గంలో దీర్ఘకాలిక స్వాతంత్య్రోద్యమం నడిపి మహాత్ముడు అయ్యాడనిసుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) జస్టిస్‌ నూతలపాటి వెంకటరమణ అనాురు. ఆయన వారసులుగా మనం గర్వించాల్సిన విషయమనిపేర్కొనాురు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి పునర్ముద్రణ చేసిన 'సత్యశోధన మహాత్మునిఆత్మకథ' పుస్తకానిు తిరుపతి రాహుల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో సిజెఐ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1921, 1933 సంవత్సరాల్లో తిరుపతి పట్టణంలో మహాత్మాగాంధీపర్యటించారని, ఇది తిరుపతివాసుల అదృష్టమనిపేర్కొనాురు. గాంధీ నడిచిన నేలపై ఈ పుస్తకానిు ఆవిష్కరించడానిు అదృష్టంగా భావిస్తునాుననిఅనాురు. ఓ సామాన్య మానవుడు మహాత్మునిగా మారిన కథే ఈ పుస్తక సారాంశమనిపేర్కొనాురు. ప్రస్తుత రాజకీయాల్లో నిజం చెప్పడం చాలా కష్టమని, నైతికతలేనిరాజకీయం ప్రమాదకరమనిఅనాురు. ప్రస్తుత కుటిల రాజకీయాలను పారదోలి, స్వచ్ఛమైన రాజకీయాల దిశగా ఉద్యమం నడవాలనిపేర్కొనాురు. తెలుగు భాషను, సాంస్కృతిక కళలను రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనాురు. త్వరలోనే మరోసారి తెలుగు భాషా బ్రహ్మోత్సవాలు తిరుపతిలో జరిగేలా కృషి చేయాలనితిరుపతి ఎమ్మెల్యేను కోరారు. అనంతరం గాంధీ ప్రతిమను సిజెఐకుఎమ్మెల్యే భూమన, టిటిడి ఇఒ ఎవి ధర్మారెడ్డి బహూకరించారు. ఆవిష్కరణ సభలో తిరుపతి, చిత్తూరు, అనుమయ్య జిల్లాల కలెక్టర్లు కె.వెంకటరమణా రెడ్డి, ఎం.హరినారాయణన్‌ పి.ఎస్‌.గిరీషా, నగరపాలక మేయర్‌ శిరీషా, కమిషనర్‌ అనుపమా అంజలి, సాహితీవేత్తలు పాల్గనాురు. అంతకుముందు రాస్‌ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గుత్తా మునిరతుం కాంస్య విగ్రహానిు రాస్‌ కార్యాలయంలో సిజెఐ ఆవిష్కరించారు.

  • 'శ్రీవారి' సేవలో సిజెఐ

తిరుమల శ్రీవారినికుటుంబ సమేతంగా సిజెఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ దర్శించుకునాురు. ఆలయం ఎదుట టిడిపి చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి జస్టిస్‌ రమణకుస్వాగతం పలికారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయన్‌, టిటిడి ఇఒ ఎ.వి.ధర్మారెడ్డి తదితరులు ఆయన వెంట ఉనాురు. మధ్యాహుం మూడు గంటలకుసిజెఐ తిరుగు ప్రయాణమయ్యారు.

  • నేడు విజయవాడకు సిజెఐ రాక - కోర్టు భవనాలకు ప్రారంభోత్సవం

విజయవాడ సివిల్‌ కోర్టుల ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన కోర్టు భవనాల సముదాయానిు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి.రమణ శనివారం ప్రారంభించనునాురు. ఉదయం 7.40 గంటలకుహైదరాబాద్‌ నుండి ప్రత్యేక విమానంలో గనువరం విమానాశ్రయానికి ఆయన చేరుకుంటారు. అక్కడి నుండి రోడ్డు మార్గాన విజయవాడ వచ్చి నూతనంగా నిర్మించిన జి ప్లస్‌-7 భవనాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డితో కలిసి ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఆయనకురాష్ట్ర ప్రభుత్వం తరుఫున ఆత్మీయ సత్కారం ఉంటుంది. అనంతరం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వారు ప్రదానం చేయనును డాక్టరేట్‌ను జస్టిస్‌ ఎన్‌.వి.రమణ స్వీకరిస్తారు. సిజెఐ, ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను అధికారులు శుక్రవారం పరిశీలించారు.