Sep 23,2022 08:01

పాట్నా : ప్రజాస్వామ్యం, లౌకికవాదం, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు పోరాడాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. దేశరక్షణ భేరిలో భాగంగా సిపిఎం ఆధ్వర్యాన బీహార్‌ రాజధాని పాట్నాలో జరిగిన భారీ ర్యాలీకి వేలాదిమంది హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏచూరి మాట్లాడుతూ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా బీహార్‌ ప్రజలు, జయప్రకాశ్‌ నారాయణ్‌ పోరాడారని గుర్తు చేశారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో ప్రజా వ్యతిరేక, కార్పొరేట్‌ అనుకూల, మత విద్వేష విధానాలను అనుసరిస్తున్న మోడీ, షా నేతృత్వంలోని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు. సభలో పొలిట్‌బ్యూరో సభ్యులు అశోక్‌ ధావలే, రాష్ట్ర కార్యదర్శి లలన్‌చౌదరి తదితరులు హాజరయ్యారు.