
ఇంటర్నెట్‌డెస్క్ : కాళ్లూ, చేతులు అన్నీ అవయవాలు సరిగ్గా ఉండి కొంచెం కష్టమొస్తేనే కుంగిపోతుంటాం. అలాంటిది ఓ వ్యక్తి తనకెదురైన కష్టానికి కుంగిపోకుండా దైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకెళుతున్నాడు. అతనికి నడిచేందుకు ఓ కాలు లేదు. అయినా మొక్కవోని ధైర్యంతో ఉన్న ఒక్క కాలితోనే పొట్టకూటి కోసం రిక్షా నడుపుతున్నాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందనే దానిపై సమాచారం లేదు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఈ వీడియోపై బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ కూడా స్పందించాడు. జీవించాలనకున్నప్పుడు ఎంతో కొంత కష్టపడాలి అనిఈ వీడియోపై అమీర్‌ఖాన్ ట్వీట్ చేశాడు. ఈ వీడియోను చూసిన మరికొందరు నెటిజన్లు బాస్ నీ గట్స్‌కి సెల్యూట్ అంటూ అతన్ని ప్రశంసిస్తున్నారు.
जीना है गर कुछ प्रयास तो करना होगा
— Aamir Khan ₚₐᵣₒdy (@AamirKhanfa) January 17, 2023
स्वर्ग देखना है तो खुद को मारना होगाhttps://t.co/PwsFvru9b7 pic.twitter.com/PLzGJd3YdG