
గన్నవరం గ్రామీణం: కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం వద్ద ప్రమాదం తప్పింది. కాకినాడ నుంచి విజయవాడ వైపు వస్తున్న ఆర్టీసీ ఏసీ బస్సులో మంటలు వచ్చాయి. విమానాశ్రయం వద్ద ప్రయాణికులు దిగేందుకు బస్సును నిలిపారు. ఆ సమయంలో పొగతో కూడిన చిన్నపాటి మంటను డ్రైవర్ గమనించారు. ఆయన సూచనతో బస్సులోని ప్రయాణికులు వెంటనే కిందికి దిగి పరుగులు పెట్టారు. ఈలోపు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు.