Aug 19,2022 16:10

అంబర్‌పేట: ప్రిన్సిపల్‌ టీసీ ఇవ్వలేదని తీవ్ర మనస్థాపానికి గురైన ఓ విద్యార్థి ప్రిన్సిపల్‌ ఎదుటే పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అంబర్‌పేటలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. అంబర్‌పేటలోని నారాయణ కాలేజీలో నారాయణ స్వామి అనే విద్యార్థి చదువుకంటున్నారు. కాలేజీ యాజమాన్యం తనకు టీసీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుండటంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో విద్యార్థి ప్రిన్సిపల్‌ ఎదుటే తన ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అప్రమత్తమై విద్యార్థిని అడ్డుకునే క్రమంలో ప్రిన్సిపల్‌తోపాటు మరో ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. కాలేజీ సిబ్బంది మంటలను ఆర్పారు. ఈ ఘటనలో నారాయణ స్వామి తీవ్రంగా గాయపడ్డాడు. సిబ్బంది వెంటనే గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనతో ప్రిన్సిపల్‌ గదిలో మంటలు అంటుకుని ఏసీతో పాటు అక్కడి సామగ్రి కాలిపోయాయి. కుర్చీలు, ఇతర వస్తువులు దగ్ధమయ్యాయి. యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.