
ప్రజాశక్తి - రాయచోటి టౌన్ (అన్నమయ్య జిల్లా రాయచోటి) : పట్టణ పరిధిలోని చిత్తూరు రింగ్ రోడ్డు వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నారాయణ రెడ్డి పల్లెకు చెందిన తరుణ్ (21) అనే యువకుడు మృతి చెందగా, మరొక యువకుడికి గాయాలయ్యాయి. నారాయణ రెడ్డి పల్లెకు చెందిన తరుణ్ భూపతి బైక్‌పై రాయచోటి కు వెళ్తుండగా రింగ్ రోడ్డు వద్ద రాగానే ముందు వెళ్తున్న లారీని వోవర్ టేక్ చేయబోయి లారీ టైర్ కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో తరుణ్ అక్కడికక్కడే మృతి చెందగా భూపతి కి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు గుర్తించి గాయపడిన వ్యక్తిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్ధలానికి ట్రాఫిక్ ఎస్‌ఐ మొహమ్మద్ రఫీ చేరుకొని పరిశీలించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.