
మహారాష్ట్ర : అభ్యంతరకర రీతిలో ఎమ్మెల్యేకు యువకుడు వీడియో కాల్ చేసి బెదిరించిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్రలోని మొహౌల్ నియోజకవర్గ ఎమ్మెల్యే యశ్వంత్ విఠల్ మానేకు ఓ యువకుడు అభ్యంతరకర రీతిలో వీడియో కాల్ చేశాడు. సామాజిక మాధ్యమాల ద్వారా ఎమ్మెల్యే ఫోన్ నంబరు సంపాదించిన ఆ యువకుడు యశ్వంత్‌కు అభ్యంతరకర రీతిలో వీడియో కాల్ చేసి దాన్ని రికార్డ్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. రూ.లక్ష ఇవ్వకపోతే ఆ వీడియోను అందరికీ పంపిస్తానని మెసేజ్ చేశాడు. దీంతో ఎమ్మెల్యే పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌కు చెందిన రిజ్వాన్ అస్లాం ఖాన్ గా గుర్తించి అరెస్ట్ చేశారు. అతడి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో 90కిపైగా అశ్లీల వీడియోలు ఉన్నట్లు గుర్తించారు.