Oct 05,2022 11:25

ప్రజాశక్తి-సి.బెళగల్‌ (కర్నూలు) : బెళగల్‌ ఎస్సైగా ఏసి పీరయ్య హెడ్‌ కానిస్టేబుల్‌ రామయ్య ఆధ్వర్యంలో బుధవారం బాధ్యతలను స్వీకరించారు. ముందుగా విజయదశమి పర్వదినం సందర్భంగా శివాలయంలో పూజలతో మొక్కు తీర్చుకొని పోలీస్‌ స్టేషన్లో బాధ్యతలు చేపట్టి సిబ్బందితో సమీక్షించారు. అనంతరం ఆయుధ పూజ ఘనంగా చేపట్టి మండలంలో బాధ్యతాయుతంగా పని చేసి ప్రజాదరణ పొందాల్సిన ఆవశ్యకత అందరికీ ఉందని సిబ్బందితో పేర్కొన్నారు.