Jun 24,2022 08:59

ప్రజాశక్తి-అమరావతి : మంత్రివర్గ విస్తరణ తర్వాత తొలిసారిగా సిఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ అన్ని శాఖల కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. నూతన మంత్రి వర్గం తొలి సమావేశంలో సిఎం జగన్‌ పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటారని చర్చ జరుగుతోంది.