Nov 25,2022 22:44

ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్ర హైకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులను బదిలీ చేయడాన్ని నిరసిస్తూ న్యాయవాదులు శుక్రవారం ఆందోళనకు దిగారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నుంచి న్యాయమూర్తులు జస్టిస్‌ బట్టు దేవానంద్‌, జస్టిస్‌ డి.రమేషల బదిలీలు సరికాదనాురు. ఈ మేరకు హైకోర్టులో విధులు బహిష్కరించి న్యాయవాదులు నిరసన తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ ప్రతిపాదన వివక్షకు సంకేతమని ఆరోపించారు. గుజరాత్‌ హైకోర్టు న్యాయమూర్తి బదిలీని వెనక్కి తీసుకునాురని, అదే విధంగా రాష్ట్రం విషయంలోనూ నిర్ణయం తీసుకోవాలని కోరారు. వివిధ హైకోర్టుల నుంచి ఏడుగురు న్యాయమూర్తులను ఇతర హైకోర్టులకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం గురువారం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.

ఏడుగురు న్యాయమూర్తులకు బదిలీ సిఫార్సు..
వివిధ హైకోర్టుల నుంచి ఏడుగురు న్యాయమూర్తులను ఇతర హైకోర్టులకు బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు కొలీజియం గురువారం సిఫార్సు చేసింది. ఇందులో తెలంగాణ హైకోర్టు నుంచి ముగ్గురు, ఆంధ్రప్రదేశ్‌, మద్రాస్‌ హైకోర్టుల నుంచి ఇద్దరు చొప్పున న్యాయమూర్తులున్నారు. తెలంగాణ హైకోర్టు నుంచి జస్టిస్‌ కన్నెగంటి లలితను కర్నాటక హైకోర్టుకు, జస్టిస్‌ డాక్టర్‌ డి.నాగార్జునను మద్రాస్‌ హైకోర్టుకు, జస్టిస్‌ ఏ.అభిషేక్‌రెడ్డిని పట్నా హైకోర్టుకు, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నుంచి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ను మద్రాస్‌ హైకోర్టుకు, జస్టిస్‌ డి.రమేష్‌ను అలహాబాద్‌ హైకోర్టుకు మద్రాస్‌ హైకోర్టు నుంచి జస్టిస్‌ వి.ఎం.వేలుమణిని కలకత్తా హైకోర్టుకు, జస్టిస్‌ టి.రాజాను రాజస్థాన్‌ హైకోర్టుకు బదిలీ చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని కొలీజియం సిఫార్సు చేసింది. ఈ బదిలీల ప్రతిపాదనను నిరసిస్తూ ఈరోజు ఎపి హైకోర్టు న్యాయవాదులు ఆందోళన నిర్వహించారు.