Aug 19,2022 16:31

అమరావతి: పవర్‌ ఎక్స్ఛేంజీల ద్వారా కొనుగోలు చేస్తున్న విద్యుత్‌కు ఎపి ప్రభుత్వం ఎలాంటి బకాయిలూ లేదని, సమాచారం లోపం వల్లే విద్యుత్‌ క్రయ విక్రయాల నిషేధిత జాబితాలో ఎపిని చేర్చారని ఎపి ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ''విద్యుత్‌ క్రయవిక్రయాల విషయంలో కేంద్రం విధించిన నిషేధం ఎపికి వర్తించదు. ఎపి డిస్కమ్‌లు చెల్లించాల్సిన రూ.350 కోట్లు ఇప్పటికే చెల్లించేశాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాచారం వెళ్లడంతో ఆ జాబితా నుంచి ఎపి పేరు తొలగించారు'' అని అన్నారు.
ఎపి, తెలంగాణ సహా 13 రాష్ట్రాల్లో విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్స్ఛేంజీల నుంచి జరిపే రోజువారీ కరెంటు కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే.