Oct 02,2022 22:44
  • 19న భూ సదస్సు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 'నవరత్నాలు' పథకాల్లో భూ పంపిణీని కూడా చేర్చాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సుల ప్రకారం..భూమి లేని నిరుపేదలందరికీ తక్షణమే భూ పంపిణీ చేపట్టాలని వినువించింది. వ్యకాస రాష్ట్ర విస్తృత సమావేశం ఆదివారం కొరటాలా బాపనయ్య (కెబి) భవన్‌లో జరిగింది. సమావేశ నిర్ణయాలను ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దడాల సుబ్బారావు, వి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 19న విజయవాడలో రాష్ట్ర స్థాయి భూసదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. భూమికోసం, భూపంపిణీ కోసం, అసైన్డ్‌ భూముల రక్షణ కోసం, బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా, అటవీ భూముల సాగుదార్లకు హక్కులు కల్పించాలని, పేదల నివాసాలకు పట్టాలు ఇవ్వాలని, తక్షణమే అన్ని స్థాయిలో అసైన్డ్‌మెంట్‌ కమిటీలను నియమించాలనే డిమాండ్లతో ఈ సదస్సు నిర్వహించనునుట్లు పేర్కొనాురు. రాష్ట్ర ప్రభుత్వం ఈ డిమాండ్లపై స్పందించకపోతే ప్రత్యక్ష భూ పోరాటం చేపట్టనునుట్లు హెచ్చరించారు. పేదలకు అనుకూలంగా ఉను భూ సీలింగ్‌, అసైన్డ్‌, అటవీ హక్కులు, 2013 భూసేకరణ చట్టాలను అభివృద్ధి పేరిట తుంగలో తొక్కి నష్టపరిహారం, పునరావాసం చెల్లించకుండా పేదలను రోడ్డుపాలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో గత టిడిపి, ప్రస్తుత వైసిపి ప్రభుత్వాలు పేదల చేతుల్లో ఉన్న భూములను గుంజుకొని పెట్టుబడిదారులకు ధారాదత్తం చేస్తున్నాయని విమర్శించారు. పేదలు తిరగబడితే అక్రమంగా కేసులు పెట్టడం, వందలాది మంది పోలీసు బలగాలను మొహరించి పేదలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఆ సంఘం కార్యదర్శివర్గ సభ్యులు వి శివనాగరాణి, డి వెంకను, కె వెంకటేశ్వరరావు, జె సత్యనారాయణ, ఎ రవి, ఎం రాజేష్‌, కె కళ్యాణ్‌, ఈ అప్పారావు, కె ఆంజనేయులు, ఎం పుల్లయ్య, వి నాగరాజు, ఎం నాగేశ్వరరావు, కెవి నారాయణ పాల్గొన్నారు.