Mar 27,2023 13:31

ప్రజాశక్తి-విజయనగరం కోట : ఎపిఎస్‌ఆర్టీసీ ఔట్సోర్సింగ్‌ హయ్యర్‌ బస్‌ డ్రైవర్లకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని ఎపిఎస్‌ఆర్టీసీ ఔట్సోర్సింగ్‌, హయ్యర్‌ బస్‌ డ్రైవర్స్‌ యూనియన్‌ ఏఐఆర్‌టిడబ్ల్యూఎఫ్‌ అనుబంధం విజయనగరం జిల్లా కమిటీ నాయకులు జగన్మోహన్‌, నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌ వద్ద ఎపిఎస్‌ఆర్టీసీ ఔట్సోర్సింగ్‌ హైయర్‌ బస్‌ ఉద్యోగులు నిరసన చేపట్టారు. బస్సు రిపేర్‌ వచ్చి ఆగిపోయిన డ్రైవర్లకు పూర్తి వేతనం చెల్లించాలన్నారు. బస్సు పాస్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. కార్గో సర్వీసులకు లోడింగ్‌ అన్లోడింగ్‌ తో సంబంధం లేకుండా రోజువారీ వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.