
జెరూసలెం : ఇజ్రాయిల్ పార్లమెంట్ రద్దయింది. దీంతో నాలుగేళ్ల కన్నా తక్కువ కాలంలోనే అయిదోసారి ఎన్నికలకు రంగం సిద్ధమైంది. పార్లమెంట్‌ను రద్దు చేసేందుకు అనుకూలంగా గురువారం పార్లమెంట్ సభ్యులు ఓటు వేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత శుక్రవారం దేశ తాత్కాలిక ప్రధానిగా విదేశాంగ మంత్రి యాపిర్ లాపిడ్ బాధ్యతలు చేపడతారు. ఇజ్రాయిల్‌లో 12ఏళ్ల సుదీర్ఘ పాలన అనంతరం బెంజమిన్ నెతన్యాహును గద్దె దించుతూ నఫ్తాలి బెర్నెట్ సంకీర్ణం అధికారంలోకి వచ్చి ఏడాది కూడా గడవలేదు, ఇంతలోనే కూలిపోయింది. దీంతో తాత్కాలిక ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇజ్రాయిల్ ఎన్నికలు నవంబరు 1న నిర్వహించనున్నారు.