Nov 24,2022 18:57

సమంత అనారోగ్యంపై సోషల్‌మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఉన్నట్టుండి ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైందని.. కుటుంబ సభ్యులు ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో జాయిన్‌ చేసినట్లుగా ఊహాగానాలు వెల్లడవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ వార్తలపై ఆమె టీమ్‌ స్పందించింది. ఆ వార్తలను ఖండిస్తూ.. ఆమె ఆరోగ్యంగానే ఉందని.. హాస్పిటల్‌లో చేరినట్లు వస్తోన్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని.. ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నారని పేర్కొన్నారు. మయోసైటిస్‌ అనే అరుదైన రుగ్మతతో ఇబ్బందిపడుతోన్న సమంత.. గత కొన్ని నెలలుగా సినిమాలకు దూరమైంది. ఆమెకు మయోసైటిస్‌ థర్డ్‌ స్టేజిలో ఉంది. వ్యాధి తీవ్రత కాస్త తీవ్రంగా ఉన్నా.. తానున్న స్టేజీ ప్రాణాపాయం మాత్రం కాదని ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.