Oct 05,2022 15:28

ప్రజాశక్తి-అమలాపురం (కోనసీమ) : ప్రముఖ నటి ఆర్‌ఎక్స్‌ 100 ఫేమ్‌ పాయల్‌ రాజ్‌ పుత్‌ బుధవారం అమలాపురం పట్టణంలో సందడి చేశారు. అమలాపురం స్థానిక వెంకట రమా థియేటర్‌ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ఆనంద సాయి స్వీట్స్‌ స్టాల్‌ను పాయల్‌ రాజ్‌ పుత్‌ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణంలో సినీ హీరోయిన్‌ రావడంతో ఆమెను చూడడానికి యువత పెద్ద ఎత్తున బారాలు తీరి ఆమెకు అభివాదం చేసేందుకు పోటీపడ్డారు. అమలాపురం పట్టణం అంటే తనకు ఎంతో ఇష్టమని తను అమలాపురం రావడం ఇది రెండోసారని ఇక్కడ వాతావరణం తనకు ఎంతగానో ఆకట్టుకుందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.

palay