Apr 26,2023 18:22

సినీనటి సమంతపై అభిమానంతో ఏకంగా గుడి కట్టాడు ఓ అభిమాని. బాపట్ల జిల్లా చుండూరు మండలం అలపాడుకు చెందిన తెనాలి సందీప్‌.. నటి సమంతకు వీరాభిమాని. ఆమె నటనతో పాటు పలు సేవా కార్యక్రమాలను చూసి అభిమానం పెంచుకున్నాడు. ముఖ్యంగా ప్రత్యూష ఫౌండేషన్‌ ద్వారా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించడంలో సమంత చూపిన చొరవకు ఆకర్షితుడయ్యాడు సందీప్‌. చిన్న పిల్లలకు పునర్జన్మ ఇస్తున్న ఆమెపై అభిమానం రెట్టింపవ్వడంతో గుడి కట్టాలని నిర్ణయించు కున్నాడు. తన ఇంటి ప్రాంగణంలోనే ఆలయ కోసం స్థలం కేటాయించి విగ్రహాన్ని కూడా తయారు చేయించాడు. ప్రస్తుతం విగ్రహానికి, గుడికి తుది మెరుగులు దిద్దే పనులు జరుగుతున్నాయి. ఈ నెల 28వ తేదీన ఆలయం ప్రారంభిస్తున్నట్లు సందీప్‌ తెలిపారు. ఇప్పటి వరకూ సమంతను నేరుగా చూడలేదని, కేవలం ఆమెపై అభిమానంతోనే గుడి నిర్మిస్తున్నట్లు చెప్పారు.