Sep 28,2022 20:14

న్యూఢిల్లీ : అతి సులభంగా నగదు ఉపసంహరణల సౌకర్యం అందించేందుకు వీలుగా మైక్రో ఎటిఎంలను ప్రారంభిస్తున్నట్లు ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ తెలిపింది. దేశ వ్యాప్తంగా 5 లక్షల పైగా బ్యాకింగ్‌ పాయింట్లను అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొంది. ఇందుకోసం ఎన్‌ఎఫ్‌ఎస్‌, ఎన్‌పిసిఐతో అనుసంధానం అయినట్లు తెలిపింది. ఈ మైక్రో ఎటిఎంల ద్వారా ఒక్క లావాదేవీకి గరిష్టంగా రూ.10వేల వరకు ఉపసంహరించుకోవచ్చని తెలిపింది.