Nov 24,2022 18:53

స్టార్‌ హీరో రాంచరణ్‌ ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం 'ఆర్‌సీ 15'. పొలిటికల్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తున్న ఈ చిత్రం న్యూజిలాండ్‌లో షూటింగ్‌ జరుపుకుంటోంది. కాగా రాంచరణ్‌ హెయిర్‌స్టైలిష్‌ ఆలీమ్‌ హకీంతో సరదాగా చిట్‌చాట్‌ చేస్తున్న స్టిల్‌ను నెట్టింట షేర్‌ చేశాడు. సినిమాలో వచ్చే డ్యుయెట్‌ సాంగ్‌ గురించి ఇద్దరూ చర్చించుకుంటున్నట్లు చరణ్‌ తెలిపారు. బోస్కొ మార్టిస్‌ ఈ పాటను కంపోజ్‌ చేస్తున్నారు. వారం పాటు జరిగే షెడ్యూల్‌లో ఈ పాటను కూడా షూట్‌ చేయనున్నారు. ఈ చిత్రానికి ఎస్‌ థమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తోంది. దిల్‌ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.