
ప్రజాశక్తి-ఆదోని (కర్నూలు) : డివిజన్ కేంద్రమైన ఆదోనిలో ఈనెల 5న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని కర్నూలు జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం మంత్రి గుమ్మనూరు జయరాము, ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డితో కలిసి మున్సిపల్ మైదానం, హేలిపాడు కు ఉపయోగించే ఆర్ట్స్ సైన్స్ కళాశాల మైదానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. సిఎం పర్యటన సందర్భంగా... ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రామకృష్ణారెడ్డి, డిఎస్పీ వినోద్ కుమార్, అధికారులు ఉన్నారు.