Oct 05,2022 09:09

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, ప్రతి ఒక్క కుటుంబానికీ విజయాలు కలిగేలా దుర్గామాత దీవెనలు, ఆశీస్సులు ఉండాలని గవర్నరు విశ్వభూషణ్‌ హరిచందన్‌, సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆకాంక్షించారు. ఈ మేరకు మంగళవారం వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమిని పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు.