
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపిలో చేరేందుకే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తమ ప్రభుత్వంపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి టిడిపిలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏముంటుందన్నారు. ఎవరి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదన్నారు. మంత్రి పదవి రాలేదని శ్రీధర్‌రెడ్డికి అసంతృప్తి ఉందన్నారు. ఇతర పార్టీల నాయకులను ఎలా లాక్కోవాలో చంద్రబాబుకు బాగా తెలుసునని వ్యాఖ్యానించారు.