Oct 05,2022 15:41

ప్రజాశక్తి-పెద్దపంజాణి(చిత్తూరు) : మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన టిడిపి కార్యాలయాన్ని బుధవారం మాజీ మంత్రి ఎన్‌.అమరనాథ్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తద్వారా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై వారికి అవగాహన ఏర్పడుతుందని అన్నారు. రానున్న ఎన్నికల్లో మండలంలో టిడిపి మెజార్టీ గతంలో కంటే ఎక్కువగా సాధించేందుకు స్థానిక టిడిపి నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం ప్రజావేదిక కూల్చడంతోనే వారి పతనం మొదలైందని రాష్ట్రంలో రివర్స్‌ టెండర్‌ పాలన సాగుతుందని, అభివద్ధి శూన్యమని అన్నారు.అందరూ సమన్వయంతో పనిచేసి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కోగిలేరు గ్రామపంచాయతీలోని గ్రామస్తులు దాదాపు 20 మంది అమర్నాథరెడ్డి సమక్షంలో టిడిపి పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు నందకుమార్‌ జిల్లా కార్యవర్గ సభ్యులు రోజా రెడ్డి, సుధాకర్‌ రెడ్డి, లింగాపురం సర్పంచ్‌ రుద్ర మూర్తి, నాయకులు వేణుగోపాల్‌ నాయుడు కృష్ణారెడ్డి,మాజీ సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.