Oct 05,2022 15:22

ప్రజాశక్తి గణపవరం : అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ అమరావతి రైతు ఐక్య కార్యచరణ సమితి ఆధ్వర్యంలో రైతులు చేపట్టిన మహాపాదయాత్ర బుధవారం జల్లికొమ్మరకు చేరుకుంది. మహా పాదయాత్రకు సిపిఎం మండల నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. పాదయాత్ర వరదరాజపురం గణపవరం సరిపల్లి గ్రామాల వరకు కొనసాగింది. పాదయాత్రలో మూడు రాజధానులు వద్దు అమరావతి రాజధాని ముద్దు అంటూ నినాదాలు చేశారు. పాదయాత్రలో స్థానికులు అడుగడుగునా హారతులు నాయకులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పెచ్చెట్టి నరసింహమూర్తి, మేడిశెట్టి పెంటారావు, నరాల శెట్టి రామకృష్ణ, గుత్తులు శ్రీనివాసు, మద్దాల లక్ష్మయ్య, రాళ్లపల్లి సత్యనారాయణ, సుబ్రహ్మణ్యం, సోడా దాసి సంజీవరావు, కే త్రినాథ్‌, పి.గోవిందు తదితరులు పాల్గొన్నారు.

amaravathi