Oct 05,2022 14:42

ప్రజాశక్తి-ఆచంట (కోనసీమ) : ప్రజలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు సష్టించేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి యాత్ర చేయిస్తున్నారని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వైట్ల కిషోర్‌ కుమార్‌ ధ్వజమెత్తారు. మూడు రాజధానులకు మద్దతుగా బుధవారం ఆచంట రామేశ్వర స్వామి ఆలయ ఆవరణలో మండల వైసిపి నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్టణం కేంద్రంగా పరిపాలన రాజధాని ఏర్పాటుపై టిడిపి నాయకులు విషం కక్కుతున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్రపై ఎందుకు అంత కక్ష అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో మీ ప్రాంతం మాత్రమే అభివద్ధి చెందాలని. మిగిలిన ప్రాంతాలన్నీ ఏమైపోయినా పరవాలేదా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలు ఇప్పటికీ వెనుకబడి ఉన్నాయని అన్నారు. ఈ ప్రాంతాల అభివద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ఏర్పాటు చేస్తామంటే మీకెందుకు ఈర్ష అని మండిపడ్డారు. కర్నూల్‌ లో హైకోర్టు పెట్టాలి అంటున్న బిజెపి నేతలు విశాఖలో పరిపాలన రాజధాని ఎందుకు వద్దంటున్నారు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్ల చాంబర్‌ అధ్యక్షులు సుంకర సీతారాం, సర్పంచులు కోట సరోజినీ వెంకటేశ్వరరావు, దిరిశాల విజయలక్ష్మి, గణేషల శేష భవాని సుబ్బారావు, జక్కంశెట్టి చంటి, బోడపాటి బుల్లయ్య, ఎంపీటీసీలు, మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.