
హైదరాబాద్: చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అంబటి రాయుడు ఐపిఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగే ఫైనల్ మ్యాచే తన కెరీర్‌లో చివరిదని ఆదివారం ట్వీట్ చేశాడు. 2010లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన రాయుడు గుజరాత్‌పై చెన్నై గెలిస్తే ఆరో టైటిల్‌ను నెగ్గిన జట్టులో సభ్యుడు కానున్నాడు. ముంబయి ఇండియన్స్ తరఫున(2013, 2015, 2017).. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున(2018, 2021) టైటిల్స్ నెగ్గిన జట్టులో రాయుడు ఓ ఆటగాడు. 2018లో చెన్నై ఛాంపియన్‌గా నిలవడంలో రాయుడు కీలకపాత్ర పోషించాడు.