Jul 03,2022 07:18

 భద్రతా మండలిలో రష్యా, చైనా, ఇరాన్‌ విమర్శ
దోహా :
ఇరాన్‌ అణు ఒప్పందాన్ని పునరుద్ధరించే లక్ష్యంతో కతార్‌ రాజధాని దోహాలో రెండు రోజుల పాటు జరిగిన చర్చలు ఎలాంటి నిర్దిష్ట ఫలితాన్ని సాధించకుండానే ముగియడానికి అమెరికాయే కారణమని ఇరాన్‌, రష్యా, చైనా విమర్శించాయి. బహుళ పో అణు ఒప్పందం కొనసాగించడానికి తాము సిద్ధమేనని ఇరాన్‌ పునరుద్ఘాటించింది. ఐరాస భద్రతామండలిలోనూ ఇదే విషయాన్ని అది స్పష్టం చేసింది. ఐరాసలో ఇరాన్‌ రాయబారి మజిద్‌ తక్త్‌ రావంచి మాట్లాడుతూ, జెసిపిఓఎ (సమగ్ర కార్యాచరణ ఒప్పందం)ను మరోసారి ఉల్లంఘించబోనని అమెరికా నిర్దిష్టంగా హామీ ఇవ్వాలని తాము కోరుతున్నామన్నారు. ఏవో సాకులతో తమపై ఆంక్షలు రుద్దడానికి అమెరికా యత్నించరాదని ఆయన పేర్కొన్నారు. చైనా రాయబారి ఝాంగ్‌ జున్‌ మాట్లాడుతూ, ఇరాన్‌ హేతుబద్ధమైన డిమాండ్లకు అమెరికా సానుకూలంగా స్పందించాలని కోరారు. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవాలన్నారు. సాధ్యమైనంత త్వరలో రాజకీయ నిర్ణయం తీసుకోవాలన్నారు.