May 25,2023 06:41

అమ్మ నా అందమైన అమ్మ
నన్ను తొమ్మిది నెలలు నీ కడుపులో మోశావు
ఎంతో బాధను భరించావు
నన్ను ఎంతో జాగ్రత్తగా పెంచావు
అనురాగాలను పంచావు
అమ్మ ప్రేమ రుచి చూపించావు
నా బాధను నీ బాధగా చూసుకున్నావు
నా జీవితంలో ఆనందాన్ని నింపావు
నా తొలి గురువై నిలిచావు
నిన్ను ఎప్పుడు బాధపెట్టనమ్మా
ఐ లవ్‌ యూ అమ్మ...

2

 

 

 

 

 

- పి. శ్రీదీక్షిత 6వ తరగతిఎం. తిమ్మాపురం ఆదర్శ పాఠశాల
మహానంది (మం), నంద్యాల జిల్లా