Sep 22,2022 16:05

మెదక్‌ జిల్లా : కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని..కేంద్రం అనాలోచిత నిర్ణయాలతో రైతులను విస్మరిస్తోందని మంత్రి హరీష్‌ రావు ఆరోపించారు. మెదక్‌ జిల్లా పరిషత్‌ ఛైర్‌ పర్సన్‌ హేమలత అధ్యక్షతన కలెక్టరేట్‌ ఆడిటోరియంలో గురువారం ప్రారంభమైన జిల్లా ప్రజా పరిషత్‌ సర్వసభ్య సమావేశం సమావేశానికి హాజరైన ఆయ మాట్లాడారు.ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ..'' 1.35 కోట్ల ఎకరాల్లో పంటలు తెలంగాణలో పండుతున్నాయని, దేశంలోనే ఎక్కువ పంటలు పండుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కాళేశ్వరం ద్వారా భవిష్యత్‌లో మరిన్ని ఫలితాలు పొందుతారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయమని చెప్పడంతో.. చివరి గింజ వరకు కొనుగోలు చేశాము. విదేశాలకు వ్యవసాయ ఉత్పత్తులు పంపకుండా కేంద్రం సెస్‌ వేసింది. రాష్ట్రంలో ఎరువుల కొరత లేకుండా చూడాలని వ్యవసాయ అధికారులకు ఆదేశం ఇచ్చాము. ఖరీఫ్‌ వడ్ల కొనుగోళ్ళకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించాము. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌ రెడ్డి, మదన్‌ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.