
శ్రీకాకుళం : కిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ గూడేన సోమేశ్వరరావును కిడ్నాప్ చేసేందుకు దుండగులు యత్నించిన ఘటన బ్లెస్ జిమ్ కింద బుధవారం చోటుచేసుకుంది. వైజాగ్ నుండి వచ్చిన నలుగురు కిడ్నాపర్లు డాక్టర్ గూడేన సోమేశ్వరరావును కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. జనం రావడాన్ని గమనించిన కిడ్నాపర్లలో ముగ్గురు తప్పించుకోగా, ఓ కిడ్నాపర్ స్థానికులకు పట్టుబడ్డాడు. ఘటనా స్థలానికి రెండో పట్టణ సిఐ ఈశ్వర్ ప్రసాద్ చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని రెండో పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.