Oct 05,2022 14:25

ప్రజాశక్తి-తిరుపతి (మంగళం) : మంగళం పరిధిలోని సప్తగిరి కాలనీలో వెలసిన శ్రీమత్‌ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో బుధవారం ఘనంగా విజయదశమి వేడుకలు నిర్వహించారు. శ్రీమత్‌ రాజరాజేశ్వరి దేవి ఆలయం కమిటీ చైర్మన్‌ పిఎం లక్ష్మీనారాయణ, కమిటి సభ్యులు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రవి నాయుడు, వెంకటేష్‌ , మురగా, మురళీ, సతీష్‌, దీపశ్రీ, వెంకటసుబ్బమ్మ, సూరి, పద్మనాభం, గురవయ్య తదితరులు పాల్గొన్నారు.