Nov 22,2022 11:19

మనీలా : అమెరికా వ్యతిరేక నిరసనలు ఫిలిప్పైన్స్‌ రాజధాని మనీలాలో పోటెత్తాయి. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ ఆ దేశంలో పర్యటించాన్ని వ్యతిరేకిస్తూ మనీలాలో పెద్దఎత్తున ఆందోళనలు చోటుచేసుకున్నాయి. వాటిని ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. 'కమలా.. నీకు ఆహ్వానం పలకడం లేదు, అమెరికా యుద్దం వద్దు', 'ఫిలిప్పైన్స్‌లో టెర్రరిజానికి నిధులివ్వడం ఆపండి' అంటూ ప్లకార్డులు చేతబూని పెద్దపెట్టున నినాదాలు చేశారు.