Sep 29,2022 19:39

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) పరీక్షకు దరఖాస్తులు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టరు డి దేవానందరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్‌, మున్సిపల్‌, ఎయిడెడ్‌, వసతి సౌకర్యం లేని ఆదర్శ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులని వెల్లడించారు. శువ్రారం నుంచి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నట్లు తెలిపారు. పరీక్ష రుసుం కింద ఒసి, బిసి విద్యార్థులు రూ.100, ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థులు రూ.50 చెల్లించాలని పేర్కొన్నారు. అక్టోబరు 31 వరకు దరఖాస్తు, పరీక్ష ఫీజు చెల్లించవచ్చునని వెల్లడించారు. ఫీజు ఎస్‌బిఐ ద్వారా మాత్రమే చెల్లించాలని తెలిపారు. పూర్తి వివరాలను ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయం వెబ్‌సైట్‌ షషష.bరవ.aజూ.స్త్రశీఙ.ఱఅలో, సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో తెలుసుకోవాలని పేర్కొన్నారు.