May 28,2023 21:05

వియత్నాంలోని డా నాంగ్‌లోని బానా హిల్స్‌ ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఇక్కడ ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన గోల్డెన్‌ బ్రిడ్జి ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. 2018లో దీనిని ప్రారంభించారు. ఈ గోల్డెన్‌ బ్రిడ్జి రెండు చేతుల మధ్యలోంచి వెళ్తున్న వంతెన ఆకారంలో ఉంటుంది. వంతెనపై నుంచి నడుస్తుంటే మేఘాల మధ్య నుంచి నడుస్తున్న అనుభూతి కలుగుతుంది. ఈ బ్రిడ్జి సముద్ర మట్టానికి వెయ్యిమీటర్ల ఎత్తులో ఉంటుంది. దీని పొడవు 150 మీటర్లు. కేవలం కేబుల్‌ కార్‌ ద్వారానే ఇక్కడికి చేరుకోవాలి. వంతెనపై ఎప్పుటికప్పుడు మారుతున్న వాతావరణ పరిస్థితులతో వింత అనుభూతిని కలిగిస్తుంది. కేవలం 20 నిమిషాల్లో మేఘాలు, పొగమంచు, ఎండ వంటి దృశ్యాలను గమనించవచ్చు. అంతేకాదు కేబుల్‌ కార్‌ రైడ్‌, బఫే భోజనం, వ్యాక్స్‌ మ్యూజియం ఇక్కడి ప్రత్యేకతలు.

2

 

4

 

6

 

4