Jun 23,2022 21:20

-ఫైనల్‌కు మహిళల రికర్వ్‌ బృందం
పారిస్‌: ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-3 మహిళల రికర్వు విభాగంలో భారత బృందం ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో దీపిక కుమారి, అంకిత భగత్‌, సిమ్రన్‌జిత్‌ కౌర్‌ బృందం 5ా3పాయింట్ల తేడాతో టర్కీని ఓడించింది. ఫైనల్లోకి దూసుకెళ్లడంతో ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత్‌కు తొలి పతకం ఖాయమైంది. దీపిక కుమారి సారథ్యంలోని మహిళల రికర్వు జట్టు తొలిరౌండ్‌లో ఉక్రెయిన్‌పై 5-1(57-53, 57-54, 55-55)పాయింట్లతో గెలిచింది. క్వార్టర్‌ఫైనల్లో గ్రేట్‌ బ్రిటన్‌పై 6ా0 (59ా51, 59ా51, 58ా50) పాయింట్ల తేడాతో విజయం సాధించి సెమీస్‌కు చేరింది. సెమీస్‌లో టర్కీపై 5-3(56-51, 57-56, 54-55, 55-55)పాయింట్ల తేడాతో చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్‌ఫైనల్లో టర్కీ జట్టు టాప్‌సీడ్‌ కొరియాను ఓడించి సెమీస్‌కు చేరింది. భారత బృందం స్వర్ణ పతకం కోసం ఆదివారం జరిగే ఫైనల్లో చైనీస్‌ తైపీతో తలపడనుంది.